సినిమా రంగంలో కొంత మంది హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై వర్కౌట్ అవుతూ ఉంటుంది. దానితో దర్శకులు ఎక్కువ శాతం రిస్కు చేయకుండా ఆ జంటపై మరో సినిమా తీసినట్లు అయితే ఈజీగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో మరోసారి అదే జంటను రిపీట్ చేస్తూ ఉంటారు. నటీనటులు కూడా ఇది వరకే వారితో కలిసి నటించి ఉండడంతో వారు కూడా తర్వాతి సినిమాలలో ఈజీగా వారితో సన్నివేశాలలో నటిస్తూ ఉంటారు. ఇలా అనేక కారణాల వల్ల కొన్ని కాంబినేషన్లలో అనేక సినిమాలు వస్తూ ఉంటాయి. ఇలా ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన జంటలు ఏవో తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరో , హీరోయిన్లుగా సందీప్ కిషన్ , రెజీనా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు వీరి కాంబోలో ఏకంగా ఐదు సినిమాలు రూపొందాయి. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరియు సౌందర్య కాంబినేషన్లో దాదాపు పది సినిమాల వరకు వచ్చాయి. ఈ కాంబినేషన్ కి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడు నాగ చైతన్య టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి.


మొదటగా వీరి కాంబోలో ఏం మాయ చేసావే మూవీ రాగ ఆ తర్వాత మనం, మజిలీ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక సీనియర్ బాలకృష్ణ , విజయశాంతి కాంబోలో కూడా అనేక మూవీలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , విజయశాంతి కాంబోలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. వెంకటేష్ , సౌందర్య కాంబోలో కూడా అనేక మూవీలు వచ్చాయి. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున , రమ్యకృష్ణ కాంబోలో కూడా చాలా సినిమాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: