రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా దక్కుతున్నాయి. ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19.83 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ మూవీ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమాలను మాత్రం క్రాస్ చేయలేకపోయింది.

అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన కలెక్షన్లకి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. మరి ఈ రెండు సినిమాలు విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్లను వసూలు చేశాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 33.53 కలెక్షన్లను వసూలు చేసి విడుదల అయిన 3 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన తెలుగు మూవీ ల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా 19.83 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: