నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దిశ పటాని హీరోయిన్గా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సాఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మూడు రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 40.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 9.82 కోట్లు , ఉత్తరాంధ్రలో 9.85 కోట్లు ,  ఈస్టు లో 6.19 కోట్లు ,  గుంటూరు లో 5.56 కోట్లు ,  కృష్ణ లో 5.20 కోట్లు ,  నెల్లూరు లో 2.88 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 3 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 84.69 కోట్ల షేర్ ... 132.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 12.40 కోట్లు , తమిళ నాడు లో 6.85 కోట్లు , కేరళలో 4 కోట్లు ,  హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 37.90 కోట్లు , ఓవర్ సీస్ లో 52.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి.


మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 198.04 కోట్ల షేర్ ... 380.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 173.56 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: