టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో మంచి పేరు హిట్ అందుకున్న ఆయన తాజాగా కల్కి సినిమాలో మెరిసాడు. అర్జున్ రెడ్డి గీతాగోవిందం టాక్సీవాలా వంటి సినిమాలతో వరుసగా విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ కి యూత్ లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పొచ్చు. అయితే తాజాగా కల్కి లో ఊహించని ఒక పాత్రలో కనిపించాడు ఈ హీరో. ఐతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో

 కనిపించారు. కల్కి మూవీలో చివరిలో ఐదు నిమిషాలపాటు కనిపిస్తాడు విజయ్. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు విజయ్ దేవరకొండ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడని.. అందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. అలాగే కల్కి సెకండ్ పార్టులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు మరిన్ని సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అతిథులుగా కనిపించినందుకు చాలా మంది స్టార్స్ ఎలాంటి

 పారితోషికం తీసుకోలేదని సమాచారం. అయితే కొంతమంది మాత్రం విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీని ట్రోల్స్ చేశారు. విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ కు అర్జునుడి పాత్ర లుక్ ను డీపీగా పెట్టుకుని విమర్శించే వాళ్లకు షాకిచ్చారు. ఎంతమంది ట్రోల్స్ చేసినా తాను అనుకున్న విధంగానే ముందుకెళ్తానని విజయ్ దేవరకొండ చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఇదిలవుండగా ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.298.5 కోట్లు రాబట్టింది. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: