సన్నీ లియోన్, ప్రియమణి, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో పోషించిన మూవీ కొటేషన్ గ్యాంగ్. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిల్మినాటి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత గాయత్రి సురేష్ నిర్మిస్తున్నారు. జూలైలో విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎంతో వైలెంట్ గా ఉన్న ట్రైలర్ లో ప్రియమణి అండ్ సన్నీ లియోన్, జాకీ యాక్షన్ సీన్స్ అండ్ డైలాగ్స్ వావ్ అనిపించాయి. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్రపృందం.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ.." కొటేషన్ గ్యాంగ్ మూవీలో చాలా యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. వాటిని చూశాక నాపై మీలో ఉన్న అభిప్రాయం మారుతుందని నేను నిర్మోహమాటంగా నమ్ముతున్నాను. ఈ మూవీ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. తప్పకుండా థియేటర్ కి వెళ్లి మూవీ చూడండి. మీ ప్రేమ ఆప్యాయతలు నాకు ఇవ్వండి " అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సన్నీలియోన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి సన్నీలియోన్ అంటే తెలీని వారు ఉండరు.

ఈమెది అంతా పాపులర్ పేరు మరి. తెలుగు చిత్ర పరిశ్రమంలో అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈమెకి మంచి గుర్తింపు ఏర్పడింది. పలు ఐటమ్ సాంగ్ లలో తనదైన ముద్ర వేసింది సన్నిలియోన్. ఇప్పుడంటే పెద్దగా సినిమాలు అండ్ ఐటమ్ సాంగ్స్ చేయడం లేదు కానీ ఒకప్పుడు సన్నీ లియోన్. ఆ విధమైన పాపులారిటీ కలిగినది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ బ్యూటీ తాజాగా నటించిన ఈ కొటేషన్ గ్యాంగ్ మూవీ ప్రేక్షకులను ఎంత మీరా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.‌ ఈ మూవీ కనుక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటే రానున్న రోజుల్లో సన్నీలియోన్ కి బెస్ట్ కెరీర్ ఉంటుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: