బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ నటించిన కల్కి ప్రభంజనం కొనసాగుతుంది. ఇక ఈ సూపర్ హీరో మూడు రోజుల్లోనే 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఘనతను సాధించిన ప్రభాస్ ఆరో మూవీగా రికార్డ్ నేలకొల్పింది. ఇక మూడు రోజుల్లో కల్కి సినిమా 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను 20020 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. శనివారం రోజు ప్రభాస్ మూవీకి వరల్డ్ వైడ్ గా 67 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక వీకెండ్ లోగా ఈ మూవీ 500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది. శనివారం రోజు తెలంగాణ అంటే ఏపీలో కలిసి 31 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అండ్ 19.80 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇక నైజాంలో శనివారం రోజు ఈ సినిమా 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సీడెడ్ లో 2.40 కోట్లు ఉత్తరాంధ్రలో రెండు కోట్లతో పాటు మిగిలిన ఏరియాలలో కోటికి పైగానే ఈ సినిమా కలెక్షన్స్ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

ఇక మూడు రోజుల్లో 132 కోట్ల వరకు గ్రాస్.. 84 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ కల్కి మూవీ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాల్చి మూవీ 168 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక తెలుగులో ప్రభాస్ మూవీ బ్రేక్ కావాలంటే మరో 86 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఆదివారం రోజుతో తెలుగులో షేర్ కలెక్షన్స్ 100 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ పై భారీగా బజ్ ఉండటం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ హివెన్ ఈజీగా క్రాస్ చేస్తుంది కల్కి మూవీ అనే అంచనాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: