ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొనే కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్ గా నిలిచింది. ఎందుకంటే ఆమె పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. సుమతిగా ఆమె కల్కిని తన గర్భంలో మోయడంతో సినిమా స్టోరీ మొత్తం కూడా ఆమె నడిపిస్తుంది. అయితే ఇలాంటి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే మిస్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ముందుగా సుమతి పాత్ర కోసం పూజ హెగ్డేని అనుకున్నారట మేకర్స్. కానీ పూజ హెగ్డే గ్లామర్ చూపించడం తప్ప పెద్దగా కష్టపడి నటించడానికి ఇష్టపడని మహానటి కదా! అందుకే చేతిలో సినిమాలు లేకపోయినా కానీ ఈ సూపర్ మూవీని రిజెక్ట్ చేసిందట. దీంతో మహానటి పూజా హెగ్డే వదిలిపెట్టిన ఆ రోల్ దీపికను వరించింది. అయితే దీపిక ప్రెగ్నెంట్ గా నటించడం, సినిమాలో మంచి నటనను కనబరచడంతో దీపికాపై ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఒకవేళ పొరపాటున మోడ్రన్ మహానటి పూజ హెగ్డే ఈ పాత్రను ఒప్పుకొని ఉంటే కచ్చితంగా సినిమా ఇంకో రాధే శ్యాం అయ్యేది అంటున్నారు నెటిజన్స్. అసలు ఈ పూజా హెగ్డే ఎక్కడా?  దీపికా ఎక్కడా? పూజా హెగ్డేకు దీపికా పడుకొన్ కి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని రియాక్ట్ అవుతూ పూజా హెగ్డేని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. 


ప్రస్తుతం మహా నటి పూజ హెగ్డే కు అవకాశాలు కరువయ్యాయని చెప్పాలి. రాధేశ్యామ్ సినిమా తర్వాత ఈ హాట్ బ్యూటీ కెరీర్ పూర్తిగా మునిగిపోయింది. అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు ఆమెకసలు అవకాశాలు అనే మాటే వినిపించకుండా పోయింది. రీసెంట్ గా సూర్య సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే పట్టేసింది అనే రూమర్లు వైరల్ అవుతున్నా కానీ వాటిపై ఇంకా అఫిషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. రాదు కూడా.. ఇక కల్కి మూవీలో పూజ హెగ్డే నటించకపోవడానికి కారణం రాధేశ్యామ్ సినిమా అని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తో రొమాన్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కానీ రాధేశ్యామ్ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ గా అయ్యింది. పైగా అందులో పూజా హెగ్డే మహా నటనపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అప్పటి నుంచి ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో పూజ హెగ్డేని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక కల్కి లో ఆమె నటించనందుకు అబ్బా సాయి రామ్ అంటూ పూజాకి థాంక్స్ చెబుతూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: