కల్కి 2898 AD సినిమా ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.అయితే 'కల్కి'లో కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. కథనం స్లోగా ఉందని, డైలాగ్స్ సరిగ్గా కాలేదని..డ్రామా పండలేదని.. ఎమోషనల్ కనెక్ట్ మిస్సయిందని.. ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి. రివ్యూల్లో కూడా ఈ విషయాలు ప్రస్తావించారు. ఐతే సినిమా మాత్రం మరి తీసేసా సినిమా అయితే కాదు. కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ ఇది మస్ట్ వాచ్ ఫిల్మ్ గా ప్రస్తుతం దూసుకుపోతుంది.దానికి మహాభారతం నేపథ్యం. ఆ సన్నివేశాలే నేడు కల్కిని మరో రాధే శ్యాం కాకుండా కాపాడాయి. ముఖ్యంగా అశ్వథ్థామ పాత్ర.. ఇంకా చివరి అరగంటలో కర్ణుడి స్క్రీన్ ప్రెజెన్స్ .. ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నడూ చూడనివి. 


టికెట్ డబ్బులకు మించి ఇవి వినోదాన్నిచ్చే ఎలిమెంట్స్ ఇవి. ఇవి చూశాక బోరింగ్ అనే ఫీలింగ్ ఉండదు.. అందుకే ఇప్పుడు 'కల్కి' వసూళ్లు సూపర్ గా ఉన్నాయి. మొత్తానికి ఈ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం కల్కి సినిమాకి ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ తో   భారీ భారీ బుకింగ్స్ ని అందుకుంటుంది.అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: