రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 AD సినిమా ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.ఇక 'బాహుబలి' తర్వాత వరుసగా డిజాస్టర్లు పడేసరికి ప్రభాస్ పనైపోయిందని ట్రోల్ చేశారు యాంటి ఫ్యాన్స్. కానీ 'సలార్' లాంగ్ రన్ లో నిరాశ పరచినా ఆ సినిమా ఓపెనింగ్ నంబర్లు మాత్రం 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలకు దగ్గరగా వెళ్లడం విశేషం. ఇక లేటెస్ట్‌గా ప్రభాస్ నుంచి వచ్చిన 'కల్కి' అయితే బాహుబలి రేంజ్ హిట్ ని ఇచ్చింది. ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, వచ్చిన ఓపెనింగ్స్ ప్రభాస్ స్టామినాని మరోసారి చూపించాయి.


 'కల్కి'కి 'బాహుబలి' రేంజ్ లో పెద్దగా ప్రమోషన్లు చేయకున్నా కూడా ఓపెనింగ్స్‌ మాత్రం అదరగొట్టింది.హిందీలో టాప్ స్టార్ల సినిమాలు కేవలం 10-15 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుంటే.. 'కల్కి'కి మాత్రం రెట్టింపు స్థాయిలో తొలి రోజు వసూళ్లు వచ్చాయి. అమెరికాలో మొదటి రోజు 5.6 మిలియన్ డాలర్లతో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది 'కల్కి'. తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్కికి భారీగా ఆరంభ వసూళ్లు వచ్చాయి. పస లేదనుకున్న తమిళనాడు, కేరళల్లో కూడా 'కల్కి' అదరగొడుతోంది. ప్రభాస్ స్టార్ పవర్‌తో ఈ చిత్రం అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. దీన్ని బట్టి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ప్రస్తుతం ప్రభాస్ మరోసారి నెంబర్ 1 హీరోగా ట్రెండ్ అవుతున్నాడు.గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: