నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం మొదటగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత భగవంత్ కేసరి అనే మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా పోయిన సంవత్సరం బాలకృష్ణ రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు రాగా రెండు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో "ఎన్ బీ కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా యొక్క చిత్రీకరణను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా హీరోయిన్గా కనిపించబోతుంది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కనిపించబోయే మరో హీరోయిన్అమ్మాయి అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

తాజాగా మరో ముద్దు గుమ్మ పేరు హల్చల్ అవుతుంది. యాష్ హీరోగా రూపొందిన కే జి ఎఫ్ సిరీస్ మూవీ లో హీరోయిన్గా నటించిన శ్రీ నిధి శెట్టి ని ఎన్ బీ కే 109 మూవీ లో మరో హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి నిజంగానే ఈమె ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా నటిస్తుందా లేదా అనేది చూడాలి ఇకపోతే ఎన్ బి కె 109 మూవీ విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk