టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన అగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన మూడు సినిమాలని విడుదల చేయకుండా సంస్థ నాలుగేళ్ల నుంచి ఆలస్యం చేస్తోందని వెల్లడించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు "మిస్టర్ బచ్చన్," "విశ్వం," "మా కాళి,", "స్వాగ్" సినిమాలతో సహా తమ అప్‌కమింగ్ సినిమాల గురించి చర్చించిన మీటింగ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆదిత్య మాట్లాడుతూ.. "నా మూడు సెన్సిబుల్, విలువైన సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను, మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి కనీసం ఒక్క క్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది.” అని ఫేస్‌బుక్ లో ఆయన పోస్ట్ చేశారు. 


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ ఆదిత్య సినిమాలను ఎందుకు విడుదల చేయడం లేదో సరైన కారణాలు ఇంకా తెలియ లేదు. కానీ వాళ్ళ తీరు ఆదిత్యని మాత్రం బాగా బాధపడుతున్నట్లు అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్ చేసిన "లవ్ @ 65", "మర్యాద కృష్ణయ్య", "మీరెవరు" వంటి మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కానీ ఏళ్లకు ఏళ్లు ఆలస్యం చేయడంతో ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమాలను ప్రొడక్షన్ హౌస్ విడుదల చేస్తుందని ఆశిస్తూ ఆలస్యం చేస్తుంది.వి.ఎన్ ఆదిత్య తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు.అప్పుడు థియేటర్లలో 200 రోజుల పాటు విజయవంతంగా ఆడిన "మనసంతా నువ్వే" లాంటి మాస్టర్ పీస్ సినిమా తీసి ఆదిత్య మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగార్జున హీరోగా "నేనున్నాను" అనే సినిమాతో కూడా మంచి హిట్ ఇచ్చారు. తరువాత "బాస్" మూవీ  కూడా విజయం సాధించింది. 


ఆ తరువాత ఇప్పటి వరకు ఆయన ఒక్క మూవీ కూడా కమర్షియల్ హిట్ కాలేదు. 2011 తర్వాత ఆయన తెలుగు సినిమాలు చేయలేదు. 2018లో మాత్రం ఒక ఇంగ్లీష్ సినిమా తీశారు. అయితే దాని వల్ల వచ్చిన గుర్తింపు ఏమీ లేదు.  ఆ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఏకంగా మూడు సినిమాలు తీశాడు. అవి మాత్రం ఇంకా రిలీజ్ కావడం లేదు. కార్తికేయ 2, వెంకీ మామ, నిశ్శబ్దం, ఓ బేబీ ఇంకా ధమాకా వంటి సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అయ్యింది. మరి ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ పై ఓ సీనియర్ డైరెక్టర్ ఆరోపణ చెయ్యడం అనేది ఆ సంస్థకి ఖచ్చితంగా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: