కొన్ని సంవత్సరాల క్రితం రామ్ పోతినేని హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రామ రామ కృష్ణ కృష్ణ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2010 సంవత్సరం విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకు సంబంధించిన లైన్ ను నాకు దర్శకుడు శ్రీ వసు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇది ఒక ఊరిలో ఒక కుర్రవాడి కథ , అలాగే మరొక చోట ఒక సీరియస్ పాత్రలో ఉన్న అర్జున్ కథ. ఈ ఇద్దరిని కలిపే ఒక కథ రామ రామ కృష్ణ కృష్ణ మూవీ. ఈ కథ వినగానే నాకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇక ఆ తర్వాత ఇంత పవర్ఫుల్ కథకి అంతే స్టార్ కాస్ట్ ఉండాలి అని డిసైడ్ అయ్యాను. దానితో అర్జున్ లాంటి ఒక గొప్ప క్రేజ్ ఉన్న హీరోను ఈ సినిమాలో భాగం చేశాము.

అలాగే ఎం ఎం కీరవాణిని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాము. అలాగే ఆ రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను చాలా రోజులు చిత్రీకరించాం. దాని వల్ల బడ్జెట్ చాలా పెరిగిపోయింది. ఇక సినిమా విడుదల అయ్యాక మూవీకి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ చాలా చోట్ల పది వారాలు అడిగింది. 10 వారాలు ఒక సినిమా ఆడడం చిన్న విషయం ఏమీ కాదు. ఈ మూవీ ద్వారా డబ్బులు బాగానే వచ్చాయి. కాకపోతే ఈ సినిమాకు మేము ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కువ. అందువల్ల మాకు నష్టం వచ్చింది. అంతేకానీ ఇది యవేరేజ్ సినిమా కాదు. ఇది హిట్ సినిమానే. మేము ఎక్కువ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్లే ఈ సినిమాకు నష్టం వచ్చింది అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: