హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి అనే సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా కుర్రకారుకి కలల హీరో అయిపోయాడు. తాజాగా మన రౌడీ బాయ్ కల్కి సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గత రెండేళ్ల కాలంగా తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా గురించి ఎంతగానో ఎదురు చూసారు. కాగా ఎట్టకేలకు మొన్న గురువారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర షురూ చేసింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో నాలుగు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ క్రమంలోనే యూఎస్ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి . అదేవిధంగా ఉత్తర భారతం, ఆస్ట్రేలియా, ఇంకా పలు దేశాల్లో కూడా కల్కి సినిమా సాధిస్తున్న వసూళ్లు హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇపుడు ఈ సినిమాలో ఉన్న గెస్ట్‌ అప్పియరెన్స్‌ ల గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌తో పాటుగా చిన్న పాటి కేమియో రోల్స్ లో విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి తదితరులు నటించగా ముఖ్యంగా విజయ్ దేవర కొండ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఎందుకంటే విజయ్ చేసిన రోల్ చిన్నదే అయినప్పటికీ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కల్కి లో తాను పోషించిన పాత్ర గురించి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ... కల్కిలో నేను పోషించిన పాత్ర పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పాత్రను నేను కేవలం నాగి కోసం, ప్రభాస్ పై ఉన్న అభిమానంతో మాత్రమే చేశాను. తెలుగు సినిమా స్థాయిని పెంచి హాలీవుడ్‌ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలు దక్కించుకుంటున్న ఈ సినిమాలో నేను కూడా ఓ భాగం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్‌ పైనే బాణం వేయడం ద్వారా డామినేట్‌ చేశారు అంటూ ప్రశ్నించగా... అక్కడ ఉన్నది నేను ప్రభాస్ కాదు.. అర్జునుడు, కర్ణుడు అని చెబుతూ ప్రసంగం ముగించాడు రౌడీ దేవర కొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: