టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమాల తర్వాత అనిల్ రావిపూడి తెలుగులో కామెడీ సినిమాల చిత్ర దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ అనిల్‌ రావిపూడి మరోసారి వర్క్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇక మన వెంకీ మామ బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్ తరువాత ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ మూవీ చేయాలని ఎదురు చూస్తున్న సమయంలో అనిల్ రావిపూడి గుర్తుకు వచ్చాడట. ఈ క్రమంలోనే అనిల్ ఒక మంచి వినోదాత్మక కథ తో వచ్చాడని, దాంతో వెంకీ వెంటనే ఓకే చెప్పాడని సమాచారం. రెండు మూడు నెలల క్రితమే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం సినిమా షూటింగ్‌ ప్రారంభం కాకపోవడం గమనార్హం.

మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీ ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. కేవలం 5 నెలల సమయంలో సినిమా పూర్తి చేసి 2025 సమ్మర్‌ సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అనిల్‌ రావిపూడి ఎప్పుడు ప్రారంభించినా వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తే బావుంటుందని అనుకుంటున్నాడట. సంక్రాంతి కలిసి వచ్చే సీజన్‌ కాబట్టి అస్సలు వదులుకోవద్దని దర్శకుడు మరియు నిర్మాత దిల్‌ రాజు కూడా భావిస్తున్నారు.

అయితే ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాని సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం అంటే సాధ్యమేనా? అని వెంకీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. కాగా అనిల్ మహేష్ బాబు వంటి సూపర్‌ స్టార్‌ తోనే సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి అందరికీ ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా భగవంత్‌ కేసరి సినిమాకు కూడా చాలా తక్కువ సమయం తీసుకున్నాడు రావిపూడి రావిపూడి. కాబట్టి వెంకీ మామ తో చేయబోతున్న సినిమాను కూడా కేవలం 100 రోజుల లోపులోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అనిల్ గురించి తెలిసినవారు అంటున్నారు. కనుక సంక్రాంతికి వెంకీ, అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ విషయంలో డౌట్‌ అసలు అక్కర్లేదన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: