కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ తన నటవిశ్వరూపం చూపించారు.అవినీతి చేసేవారికి మరణశిక్ష వేసే వాడిగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించారు. తప్పుచేసాడని చివరికి సొంత కొడుకుని కూడా కమల్ హాసన్ చంపేస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారతీయుడు 100+ వయస్సులో ఉన్నట్లు ఈ సినిమా సీక్వెల్ లో చూపించారు. అలాగే భారీ ఫైట్స్ చేసినట్లు కూడా చూపించారు. మూవీలో సిద్ధార్ధ్  సొసైటీలో అవినీతి మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సేనాపతి ఇండియా తిరిగి వస్తాడు. 


సొసైటీలో పెరిగిపోయిన అవినీతిపై తన స్టైల్ లో పోరాటం చేస్తూ యుద్ధం చేస్తాడని రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఇంచుమించు ట్రైలర్ లోనే భారతీయుడు 2 సినిమా కథ ఏంటనేది శంకర్ చెప్పేశాడు. ఈ సినిమా ట్రైలర్ బట్టి సోషల్ మీడియాలో మూవీపైన రకరకాల కథలనేవి ప్రచారంలోకి వచ్చాయి. ఇంకా అలాగే భారతీయుడు 3 కూడా ఉండబోతోందని శంకర్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 3 స్టోరీ ఇదే అంటూ చాలా గాసిప్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే భారతీయుడు 3లో సేనాపతి తండ్రి పాత్ర కూడా వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సేనాపతి తండ్రి పాత్ర అంటే దానిని శంకర్ ఎలా డిజైన్ చేసి ఉంటాడా అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఒక వేళ సీక్వెల్ గా చేస్తే ప్రస్తుతం సేనాపతి వయస్సు 100+ ఉంది. అతని తండ్రి క్యారెక్టర్ కచ్చితంగా 120+ ఉండే అవకాశాలు ఉంటాయనే మాట కూడా వినిపిస్తోంది. అయితే భారతీయుడు3ని గూస్ బంప్స్ క్రియేట్ చేసే విధంగా ప్రీక్వెల్ గా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: