పాన్ ఇండియా హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ప్రభాస్. తన కెరీర్ లో ఎన్నో సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు డార్లింగ్. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ కల్కి లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీర్పు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

అదేవిధంగా ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ బాగా కలిసి వచ్చింది. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లోను ఈ సినిమా దుమ్ము రేపుతుంది. కల్కి హిందీ వర్షన్ లో రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమా హిందీ వర్షంలో ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ను రాబట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ గురువారం రోజున 22.50 కోట్లు కలెక్షన్స్ చేయగా శుక్రవారం నాడు 23.25 కోట్లు శనివారం 26.25 అదేవిధంగా ఆదివారం రోజున 40.15 కోట్లతో 100 కోట్ల క్లబ్ లోకి సెంటర్ అయింది.

కేవలం హిందీ వర్షన్ లోనే కల్కి సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించింది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెలాంటి కలెక్షన్స్ నువ్వు రాబడుతుందో చూడాలి. ఇక ఈ మూవీలో అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా కటాని వంటి స్టార్స్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక వేరే కాకుండా సర్ప్రైసింగ్ గెస్ట్ గా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి వారు కనిపించి మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: