'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా రూ. 555 కోట్ల వసూళ్లు వచ్చేసాయి. కల్కి చిత్ర కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు.భవిష్యత్తులో జరగబోయే ఒక ఊహాజనిత కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. యూఎస్ లో కల్కి సినిమా వసూళ్లు ఏకంగా $11 మిలియన్ వసూళ్లని దాటేసాయి.  


హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 115 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి.అయితే నేటి నుంచి కల్కికి అసలు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే వీకెండ్ ముగియడంతో స్కూల్స్, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ఇంకా అలాగే ఉద్యోగస్తులు ఆఫీస్ లకి వెళ్ళిపోతారు. పబ్లిక్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. అందుకే ఈ రోజు మూవీకి పికప్ ఎలా ఉంటుందనే దానిని బట్టి మిగిలిన రోజుల్లో కలెక్షన్స్ పైన ఒక క్లారిటీ వస్తుంది. కల్కి సినిమాకి ఇప్పటి దాకా అయితే అద్భుత ఆదరణ లభించింది. ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది. కచ్చితంగా కల్కి 2898ఏడీ మూవీ వెయ్యి కోట్ల మార్క్ దాటాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభాస్ స్టామినా ఏంటో అర్థం అవుతుంది. అలాగే మూవీకి వచ్చిన హిట్ టాక్ కి ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడు నిర్మాత కూడా లాభాల బాట పడతారు.అయితే నార్త్ ఇండియాలో కల్కికి ఆదరణ పెరిగిన నేపథ్యంలో కలెక్షన్స్ కచ్చితంగా అంచనాలకి మించి వస్తాయని తెలుస్తుంది. మరి చూడాలి ఎంత వరకు అది సాధ్యం అవుతుందనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: