ప్రతి సంవత్సరం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబడుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్  7 సినిమాలు ఏవి అందులో కల్కి సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 625 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఒకటవ స్థానంలో నిలిచింది.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 565 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 557.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 520 కోట్ల కలెక్షన్ వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 507 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కలెక్షన్లను రాబడుతుంది. ఇదే జోష్లో ఈ సినిమా కనుక మరో కొన్ని రోజులు వసూళ్లను రాబడితే 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనబడుతుంది.

షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 428 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలో నిలిచింది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 424.25 కోట్ల కలెక్షన్ చేసి ఏడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: