రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 4 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 53.17 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 12.90 కోట్లు , ఉత్తరాంధ్రలో 12.92 కోట్లు ,  ఈస్టు లో 7.82 కోట్లు ,  వెస్ట్ లో5.72 కోట్లు ,  గుంటూరు లో 7.36 కోట్లు ,  కృష్ణ లో 6.95 కోట్లు ,  నెల్లూరు లో 3.69 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 4 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 110.53 కోట్ల షేర్ ... 171.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 4 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 17.70 కోట్లు , తమిళ నాడు లో 10.55 కోట్లు , కేరళలో 5.80 కోట్లు ,  హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55.70 కోట్లు , ఓవర్ సీస్ లో 65.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 265.73 కోట్ల షేర్ ... 507.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 106.27 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: