తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఆఖరుగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గోట్ "గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తలపతి విజయ్ తాజాగా తన తదుపరి మూవీ ని కూడా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే చాలా రోజులుగా తలపతి విజయ్ "గోట్" సినిమా తర్వాత ఒకే సినిమా చేయనున్నట్లు , ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లో సెటిల్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దానితో ఈయన తన తదుపరి మూవీ ని తెలుగు నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి డి వి వి బ్యానర్ లో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... విజయ్ నెక్స్ట్ చేయబోయే మూవీ ఆయన కెరియర్లో 69వ మూవీ. దానితో ఈ సినిమాని తలపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో హెచ్ వినోద్ తెరక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హెచ్ వినోద్ కొంత కాలం క్రితం కార్తి హీరోగా రూపొందిన సర్దార్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: