‘కల్కి 2898’ అనూహ్య విజయం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సంక్రాంతి పండుగ తరువాత వెలవెలపోయిన ధియేటర్లు ఒక్కసారిగా ప్రేక్షకులతో నిండిపోవడంతో ‘కల్కి 2898’ ఇచ్చిన బ్రేక్ తో రాబోతున్న ఈ అర్థ సంవత్సరం ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు బయ్యర్లు భావిస్తున్నారు.



వచ్చేనెలలో విడుదలకాబోయే ‘భారతీయుడు 2’ తో ఈ బాక్స్ ఆఫీస్ హడావిడి కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భారీ అంచనాలతో ఉన్నాయి. దీనితో రాబోతున్న నెలల్లో అనేక భారీ సినిమాలు అదేవిధంగా అనేక మీడియం రేంజ్ సినిమాలు తమ సినిమాల విజయం పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మంచు విష్ణు హీరోగా నటించన భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప కూడ లైన్ లో ఉంది.



మంచు విష్ణు కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీయబడుతున్న ఈమూవీలో కూడ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటీనటులు నటించడంతో ఈమూవీ పై కూడ క్రేజ్ ఏర్పడింది. ‘కన్నప్ప’ మూవీని కేవలం ఒక భక్తి సినిమాగా కాకుండా ఒక ఛరిత్రగా భారీ గ్రాఫిక్స్ తో తీస్తున్నారు. ఇప్పటికే చిత్రనిర్మాణం పూర్తి చేసుకున్న ఈమూవీ సరైన రిలీజ్ డేట్ గురించి ఎదురు చూస్తోంది.



ప్రస్తుత తరం ప్రేక్షకులు తమకు తెలియని విషయాల గురించి చరిత్ర గురించి సినిమాలలో బోర్ కొట్టకుండా చూపెట్టకలిగితే అలాంటి సినిమాలకు కలక్షన్స్ విషయంలో కనకవర్షం కురిపిస్తున్నారు. నేటితరం ప్రేక్షకులకు ఏమాత్రం అవగాహన లేని ‘కన్నప్ప’ చరిత్రను భక్తి యాంగిల్ తో ముడిపెట్టి పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తీయడం ఒక ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఆ ట్రెండ్ ను అనుసరిస్తూ మంచు విష్ణు తీసిన ‘కన్నప్ప’ మూవీలో ప్రభాస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీలో అతడి పాత్ర 20 నిముషాలకు పైగా ఉంటుంది అంటుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మ్యానియా కొనసాగుతున్న పరిస్థితులలో అతడి ఇమేజ్ ‘కన్నప్ప’ కు భారీ ఓపెనింగ్స్ తెచ్చి పెడుతుందని ఈమూవీ బయ్యర్లు భావిస్తున్నట్లు టాక్..




మరింత సమాచారం తెలుసుకోండి: