కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు హిందీ లో కూడా సినిమాలు చేసి భారీ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఏడాది జవాన్ అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఈ డైరెక్టర్. కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. దాంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తాజాగా సౌత్ బాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఒక కొత్త సినిమా ప్లాన్

 చేస్తున్నాడట. అలా చేస్తే తనకే అటు బాలీవుడ్ ఇటు తమిళంలో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అట్లీ తన తదుపరి సినిమా దళపతి విజయ్ తో చేయబోతున్నట్లుగా అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ మధ్యలోనే ఆయన మరో ఇద్దరు స్టార్ హీరోలతో కలిపి ఒక పెద్ద మల్టీ స్టార్ చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నట్లు గా వార్తలు వినబడుతున్నాయి.  కమల్‌హాసన్‌ , సల్మాన్‌ ఖాన్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్టు

 వినిపిస్తున్నాయి. 'జవాన్‌' తర్వాత దర్శకుడు అట్లీ కొత్త చేయలేదు. అట్లీ తదుపరి ప్రాజెక్ట్ గురించి అందరూ ఆసక్తిగా ఉన్నారు. అట్లీ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నందున, అతని నెక్స్ట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని అందుకు తగిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. అట్లీ గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నాడు. తాజాగా దీనిపై ఓ గాసిప్‌ వినిపించింది. ఈ ప్రాజెక్ట్‌లో కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ఈ వార్తతో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు. అట్లీ అద్భుతమైన యాక్షన్ లు చేస్తూ తనదైన ముద్ర వేశారు. అలాగే సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ కూడా యాక్షన్ లతో అభిమానులను అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: