ఎప్పుడూ విభినమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించే దర్శకుడు నాగ్ అశ్విన్..  ఇక ఈసారి  ఒక సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే కల్కి 2898ఏడి. ఏకంగా నాగ్ అశ్విన్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఏకంగా హాలీవుడ్ మూవీని ఇన్ మైమరిపించే విధంగా ఒక తెలుగు సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధులను  చేస్తుంది. అయితే ఇటీవల ఈ సినిమా ఏకంగా 552 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

 ఇప్పటివరకు కల్కి మూవీ సాధించిన రికార్డుల లిస్ట్ చాలానే ఉంది. అవి చూసుకుంటే..

 ఒక వీకెండ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి నిలిచింది  ఇప్పటివరకు షారుక్ ఖాన్ జవాన్ 520.79 కోట్లు పేరిట ఈ రికార్డు ఉండేది.

 మలేషియాలో ప్రభాస్ మూవీ అయిన సలార్ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డులను కల్కి తమిళ వర్షన్ సినిమా అధిగమించింది. మూడు రోజుల్లోనే అక్కడ 2.2 వసూళ్లు సాధించింది. అయితే ప్రభాస్ సలార్ మూవీ ఫుల్ రన్ టైంలో ఈ మొత్తం వసూళ్లు అందుకోవడం గమనార్హం.

 ఇక జర్మనీలోను కల్కి అదరగొట్టేసింది  ఏకంగా అత్యధిక వసూళ్లు 2.25 కోట్ల రూపాయలు సాధించిన సినిమాగా.. రికార్డ్ సృష్టించింది. బ్రహ్మాస్త్ర, కేజిఎఫ్ 2 రికార్డులను దాటింది.


 నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్ లోనే 11 మిలియన్ డాలర్లు అంటే 90 కోట్లు రాబట్టిన తొలి భారత సినిమాగా నిలిచింది కల్కి.

 ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కూడా కల్కి నిలిచింది. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 191.5 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ.


 కెనడాలో అత్యధిక వసూలు రాబట్టిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 తెలుగు సినిమాలు జాబితాలో నిలిచింది. కల్కి కంటే ముందు త్రిబుల్ ఆర్, బాహుబలి 2 సినిమాలు ఉన్నాయి. ఇలా కల్కి మూవీ రికార్డుల వేట కొనసాగిస్తుంది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: