పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్ తో దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని వంటి స్టార్ నటినటులు ఇందులో పలు కీలక పాత్రలు నటించారు. దర్శకుడు తెరకెక్కించిన సినిమా తీరుకును చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే సౌత్ లోనే కాకుండా ఈ సినిమా నార్త్ లో కూడా దుమ్మురేపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు లాంగ్

 వీకెండ్ చాలా బాగా కలిసి రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇది ఇలా ఉంటే హిందీ వర్షన్ లో కల్కి రికార్డు కలెక్షన్ అందుకుంటుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే హిందీ వర్షన్ లో ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల భారీ కలెక్షన్ రాబట్టినట్లు గా లెక్కలు చెబుతున్నాయి. గురువారం రూ.22.50, శుక్రవారం రూ.23.25, శనివారం రూ.26.25, ఆదివారం రూ.40.15 కోట్లతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది ఈ సినిమా. కల్కి కేవలం హిందీ వర్షన్ లోనే రూ.100 కోట్లకు పైగా భారీ వసూళ్లను సాధించడంతో చిత్ర బృందమంతా సంతోషం

వ్యక్తం చేస్తోంది. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత కల్కి మూవీ తో రికార్డ్ బద్దల కొడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.500 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది కల్కి. ఇప్పుడే ఈ సినిమా ఇంతటి భారీ కలెక్షన్ ను అందుకుంటుంది అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి సునామీని సృష్టిస్తుందో చూడాలి. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ పార్ట్ -1, తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ హిందీలో రూ. 100 కోట్ల నెట్ క్లబ్ లో ప్రవేశించింది. అంతేకాదు వరుసగా మూడేసి చిత్రాలు చొప్పున మధ్యలో ‘రాధే శ్యామ్’ మినహా ప్రభాస్ నటించిన అన్ని చిత్రాలు హిందీ బెల్ట్ లో మంచి వసూళ్లనే రాబట్టాయి. అంతేకాదు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను మన దేశంలో  రాబట్టిన చిత్రాలు ప్రభాస్ వి ఆరు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోకున్నా.. సలార్ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: