అయితే ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కి స్పెషల్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించారు. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పగా దీపికా పదుకోన్ పాత్రకు నటి శోభిత ధూళిపాళ డబ్బింగ్ చెప్పింది. దీపికా ఈ సినిమాలో SUM80, సుమతి అనే పాత్రలో కల్కికి జన్మనివ్వబోయే తల్లిగా కనిపించింది. ఒక మంచి ఎమోషన్ ఉన్న పాత్రలో మెప్పించింది.దీపికా పదుకోన్ పాత్రకి తెలుగు, తమిళ్ లో హీరోయిన్ శోభిత ధూళిపాళ డబ్బింగ్ చెప్పింది. ఇందుకు స్క్రీన్ మీద శోభితకు స్పెషల్ థ్యాంక్స్ కూడా వేశారు. స్క్రీన్ మీద తన పేరుని ఫోటో తీసి శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసి మూవీ టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. శోభిత మన తెలుగమ్మాయి అని తెలిసిందే. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలు చేస్తూ బిజీగా ఉంది. హాలీవుడ్ లో కూడా ఇటీవల ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శోభిత.