ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా కల్కి సినిమా మానియానే కనిపిస్తోంది. భారీ సంఖ్యలో థియేటర్లో విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం తాజాగా 555 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. కల్కి సినిమా కలెక్షన్స్ ఇలాగే కంటిన్యూ అవుతే కచ్చితంగా 1000 కోట్ల మార్కు దిశగా అడుగులు వేయబోతుందని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అభిమానులు మెచ్చిన సినిమాగా కల్కి చిత్రం పేరు సంపాదించింది. కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజువల్ ట్రీట్ తో భారీ అంచనాలను మించి కలెక్షన్స్ ను రాపడుతోంది.


ముఖ్యంగా టికెట్ల రేటు పెంచిన కూడా చూడడానికి ప్రేక్షకులు మక్కువ చెబుతున్నారు. టికెట్ల రేట్లు పెంచడం వల్ల కూడా చాలానే విమర్శలు వినిపించాయి. అయితే భారి టికెట్లు ధరల నేపథ్యంలో కుటుంబం మొత్తం సినిమాకు వెళ్లాలి అంటే సామాన్యులు సైతం ధైర్యాన్ని చేయలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడడంతో తాజాగా కల్కి సినిమా టికెట్ల రేటు పైన ఒక న్యూస్ వినిపిస్తోంది అదేమిటంటే కల్కి సినిమా టికెట్ల ధరలు తగ్గుతున్నాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలు కంటే నార్మల్ రేటుకి సినిమా టికెట్లను అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.


ఈ వారం వరకు సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను బట్టి మల్టీప్లెక్స్ థియేటర్లలో 235 రూపాయలు అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలకు సినిమా టికెట్లను విక్రయించేలా ప్లాన్ చేస్తున్నారట.అయితే ఈ వారం గడిచిన తరువాతే కల్కి సినిమా టికెట్లు ధరలను తగ్గించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టిక్కెట్టు ధరలతో కుటుంబం అంతా వెళ్లి థియేటర్లో చూడాలి అంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే అందుకే ఈ విషయాన్ని గ్రహించిన మేకర్స్ అతి త్వరలోనే టికెట్ ధరలను కూడా తగ్గించే దిశగా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని  అద్భుతంగా తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: