తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు కార్తికేయ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ ను చూపిస్తున్నాడు. పోయిన సంవత్సరం ఈ నటుడు బెదురులంక 2012 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. 

ఇలా బెదురులంక 2012 మూవీ తో చాలా రోజుల తర్వాత సక్సెస్ ను అందుకున్న ఈ నటుడు కొంత కాలం క్రితమే భజే భాయు వేగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక థియేటర్ లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓ టీ టీ లో కూడా అదే జోష్ ను చూపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ ట్రెండింగ్ లో 2 వ స్థానంలో కొనసాగుతుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: