వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో తమిళ్ , తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి అయినటువంటి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మూవీ యొక్క షూటింగ్ మరో నెల రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ యొక్క షూటింగ్ ను అత్యంత వేగ వంతంగా పూర్తి చేసి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు , ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అది ఎంతో పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

దానితో అంత పవర్ ఫుల్ పాత్ర కావడంతో దానిలో బాలకృష్ణ ను తీసుకోవాలి అని అనిల్ రావిపూడి అనుకుంటున్నట్లు , అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఆయనను కలిసి ఆ పాత్ర స్టోరీ ,సినిమా కథ మొత్తం వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సినిమా కథ మరియు ఆయన పాత్ర నచ్చి బాలకృష్ణ కనుక ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాపై క్రేజ్ అదిరిపోయే స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి నిజంగానే ఈ మూవీ లో బాలకృష్ణ నటిస్తాడా ..? లేదా ఇది కేవలం గాసిప్ గానే మిగిలిపోతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: