ఇండస్ట్రీలో లో చాలా వరకు కొంత మంది హీరోలకు కొంత మంది దర్శకులు చాలా స్పెషల్ గా ఉంటారు. ఆ హీరో , ఆ దర్శకుడు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడం , అలాగే ఆ హీరో , దర్శకుడు కూడా ఎంతో స్నేహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి కాంబోలలో బాలకృష్ణ , బోయపాటి ... అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ ఉన్నాయి. బాలకృష్ణ వరుస అపజాయలతో డీలా పడిపోయి ఉన్న సమయంలో బోయపాటి శ్రీను , బాలకృష్ణ తో సింహ అనే సినిమాను తెరకెక్కించాడు.

మూవీ వీరిద్దరి కాంబినేషన్లో మొదటి సినిమా. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో బాలకృష్ణ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో లెజెండ్ మూవీ రూపొందిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత అఖండ మూవీ రూపొందిగా అది సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే విరి కాంబోలో మరో మూవీ కూడా రాబోతోంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అర్జున్ ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో లో మొదట జులాయి అనే మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సన్నాఫ్ సత్యమూర్తి అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఆఖరుగా వీరిద్దరి కాంబోలో అలా వైకుంఠపురంలో అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబోలో మరో సినిమా కూడా తేరకేక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బాలకృష్ణ కు బోయపాటి ... అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ ఇప్పటికీ ఒక అపజయం లేకుండా అన్ని విజయాలనే ఇస్తూ వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో మంచి స్నేహ బంధం కలిగిన హీరోలుగా , దర్శకులుగా విరు కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: