'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా రూ. 555 కోట్ల వసూళ్లు వచ్చేసాయి. కల్కి చిత్ర కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు.భవిష్యత్తులో జరగబోయే ఒక ఊహాజనిత కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. యూఎస్ లో కల్కి సినిమా వసూళ్లు ఏకంగా $11 మిలియన్ వసూళ్లని దాటేసాయి. 


హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 115 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి.ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది. కానీ అన్ని చోట్ల అదరగోడుతున్నా కూడా సీడెడ్, తమిళ నాడులో మాత్రం వసూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ మూవీ అక్కడ చాలా స్లోగా ఆడుతుంది. బుకింగ్స్ తక్కువ అవుతున్నాయి. మిగిలిన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న కల్కి 2898 ఏడి.. ఆ ఏరియాల్లో ఖచ్చితంగా ప్లాప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఐదవ రోజు ఈ సినిమాకి వచ్చిన వసూళ్ళని గమనిస్తే.. ఐదో రోజు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. తెలుగులో ఈ మూవీకి రూ.14.5 కోట్లు రాగా.. హిందీలో రూ.16.5 కోట్లు వచ్చాయి. తమిళంలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, మలయాళంలో రూ.1.3 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు ఇండియాలో రూ.95.3 కోట్లు వసూలు చేసిన కల్కి 2898 ఏడీ మళ్లీ ఆ స్థాయి వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది.సోమవారం వర్కింగ్ డే కావడంతో వసూళ్లు భారీగా నెమ్మదించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: