టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగుతేరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకు గొప్ప స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ చందమామ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇందులో ఈమె తన అందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ నటికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ మగధీర సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ సినిమా ద్వారా ఈమె తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి ఈమె తెలుగు సినీ పరిశ్రమలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా కెరియర్ను ముందుకు సాగిస్తోంది. కాజల్ కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. ఇక పెళ్లికి ముందు ఈమె సినిమాల్లో తన పాత్ర పరిధి మేరకు అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయలేదు. అందులో భాగంగా చాలా సినిమాల్లో ఈమె తన హాట్ అందాలను ఆరబోసి ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక పెళ్లి ఆ తర్వాత బిడ్డకు జన్మను ఇవ్వడంతో ఈమె అలాంటి పాత్రలలో నటించకూడదు అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎవరైనా ఈమెతో సినిమా చేయాలని వస్తే మూవీ కోసం ఎంత కష్ట పడడానికి అయినా రెడీ కాకపోతే రొమాంటిక్ సన్నివేశాలలో , స్కిన్ షో ఉన్న పాత్రలలో మాత్రం చేయను అని చెప్పేస్తుందట. దానితో ఈమె పెళ్లి తర్వాత నటించిన ఏ సినిమాలో కూడా గ్లామర్ షో చేయలేదు. కానీ ఈమెకు యూత్ లో ఇప్పటికీ కూడా ఫుల్ క్రేజ్ ఉంది. దానితో ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఉండే సినిమాలలో అవకాశాలు ఈ బ్యూటీ కి ఎక్కువగా వస్తాయా అనే అనుమానం జనాల్లో ఉంది. మరి ఈమె పెడుతున్న కండిషన్స్ కు కాజల్ కి సైనా అవకాశాలు పెరుగుతాయా ..? తగ్గుతాయి ..? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: