కల్కి సినిమాకి వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. 5 రోజుల్లో ఏకంగా రూ. 590 కోట్లకు పైగా వచ్చేసాయి. కల్కి కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. యూఎస్ లో కల్కి సినిమా వసూళ్లు ఏకంగా $11 మిలియన్ వసూళ్లని దాటేసాయి. హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 120 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి.ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది. ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.34.6 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజైన ఆదివారం (జూన్ 30) ఈ కలెక్షన్లు రూ.88.2 కోట్లు కాగా.. సోమవారం సగానికి సగం తగ్గాయి.అయితే ఐదో రోజు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. తెలుగులో ఈ మూవీకి రూ.14.5 కోట్లు రాగా.. హిందీలో రూ.16.5 కోట్లు వచ్చాయి. 


తమిళంలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, మలయాళంలో రూ.1.3 కోట్లు వసూలు చేసింది. కల్కి సినిమాకి దాదాపు 380 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, విడుదలైన 5 రోజుల్లో ఒక ఏరియాలో బిజినెస్ ను దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు, కల్కి బ్రేక్ ఈవెన్ అయింది కేరళలో. ఇక్కడ స్లో గానే కలెక్షన్లు వసూలు చేస్తూ కేవలం ఐదు రోజుల్లోనే బ్రెక్ ఈవెన్ అయింది. ప్రభాస్ నటించిన బాహుబలి తర్వాత ఈ ఏరియాలో ప్రభాస్  ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు సరికదా, టార్గెట్ లో సగం కూడా దాటలేకపోయాయి. ఉన్నంతలో లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇక ఇప్పుడు కల్కి మూవీ ఐదవ రోజుకే బ్రేక్ ఈవెన్ అయింది.కల్కి సినిమా కేరళలో ఓవరాల్ గా 6 కోట్ల రేంజ్ లో ఇక్కడ  బిజినెస్ చేయగా  ఐదో రోజు దాదాపు 6 కోట్ల పైగా షేర్ వసూలు చేసినట్టు తెలిసింది. ఐదవరోజుతో ప్రాఫిట్ లోకి అడుగుపెట్టిన కల్కి కేరళలో మంచి హోల్డ్ ని చూపిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: