నందమూరి వంశంలో మూడో తరం వారసుడు నటరత్న నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై గత ఐదారు సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మోక్షజ్ఞ ఇప్పటి వరకు వెండితెరపై హీరోగా ఎంట్రీ కాలేదు. అదిగో పులి.. ఇదిగో మేక అన్న చందంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై వార్తలు ఎప్పటికప్పుడు వస్తున్నా.. అవి కార్యరూపం దాల్చడం లేదు. ఇంకా మోక్షజ్ఞ తొలి సినిమా పట్టాలు ఎక్కలేదు. నిజానికి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినిమా అభిమానులు అందరూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇటు బాలయ్య వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే కావడంతో.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై కాస్త వేడి పుట్టింది.


ఇక మోక్షజ్ఞకు కూడా సినిమాల్లోకి రావాలని బాగా ఆసక్తి పుట్టిందని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్ అన్న దివంగత జానకిరామ్ తనయుడు కూడా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీంతో ఇటు బాలయ్యలో కూడా కాస్త చురుకుతనం వచ్చిందని.. మోక్షజ్ఞను త్వరగా సినిమాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. బాలయ్య ఇప్పుడు రాజకీయంగా మంచి కంఫర్ట్ పొజిషన్‌లో ఉన్నారు. సినిమాలపరంగా కూడా వరుస సూపర్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్నారు. కూతుర్లు ఇద్దరు మంచి ఫ్యామిలీలో సెటిల్ అయ్యారు. అటు అల్లుళ్ళు కూడా రాజకీయంగా మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన బాధ్యత మోక్షజ్ఞను హీరోని చేయటమే ఉంది.


అయితే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే అందుకు బాలయ్య ఈక్వేషన్‌లే కారణం అని తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ చాలా పద్ధతిగా బాలయ్యను సినిమాల్లోకి తీసుకువచ్చారు. బాలయ్యను  ప్రారంభంలో తన దర్శకత్వంలో కొన్ని సినిమాలలో నటింపజేశారు. అలాగే తనతో పాటు కలిసి కొన్ని సినిమాలలో నటించే జాగ్రత్తలు తీసుకున్నారు. కె . విశ్వనాథ్, బాపు లాంటి మంచి దర్శకులతో కూడా బాలకృష్ణకు సినిమాలు సెట్ చేశారు. చాలా సీనియర్ దర్శకుడు మంచి దర్శకుల వద్ద శిక్షణ పొందేలా చేశారు. ఇప్పుడు బాలయ్య కూడా మోక్షజ్ఞ కెరీర్ కోసం అలాగే పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక రాబోయే ఆరు నెలల్లో.. మోక్షజ్ఞ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. ఏది ఏమైనా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఈ ఏడాదే ఉండబోతుంది అన్న క్లారిటీ అయితే వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: