మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అవసరంలేని పేరు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చిరు అనంతరం తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుతం కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్ అండ్ సైబర్ నేరాలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు ప్రమాదకరమైన గంజాయి కి బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


హత్య, అత్యాచారం కంటే ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. పేదలు అండ్ మధ్యతరగతి వారు సైబర్ నేరగాలతో చిక్కుల్లో పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలోనే డ్రగ్స్ నిర్మూలన కోసం చిరంజీవి ఒక్కరే స్పందించి వీడియో విడుదల చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో డ్రగ్స్ నియంత్రణ పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు చిరంజీవి వీడియో ద్వారా ప్రచారం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  


చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణకు తనంతట తానే ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. మిగతా నటి నటులు కూడా ముందుకు రావాలని కోరారు. ఇక ఈ నేపథ్యంలోనే సమాజం కోసం ఉపయోగపడే వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. థియేటర్ల యాజమాన్యులు కూడా డ్రగ్స్ పై అవగాహన డాక్యుమెంటరీ వీడియోలను ప్లే చేయాలని తెలిపారు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి చేసిన పనికి మెగా అభిమానులతో పాటు సామాన్య మనుషులు కూడా సంతోషపడుతున్నారు. పేదలు అండ్ మధ్యతరగతి వారు సైబర్ నేరగాలతో చిక్కుల్లో పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: