ఒకప్పుడు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ పై ఉత్తరాది దర్శకుల ప్రాభవం స్పష్టంగా కనిపించేది. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి చిరునామాగా వెలిగిన విశ్వనాధ్ బాపు దాసరి రాఘవేంద్రరావుల పేర్లు కేవలం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయి ఉండేది. వీరు ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో హిందీలో సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలకు అంతంత మాత్రంగానే పేరు వచ్చింది.



అయితే ప్రస్తుతం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ దక్షిణాది వైపు చూస్తోంది. రాజమౌళి అట్లీ సందీప్ వంగా డైరెక్ట్ గా తెలుగుతో పాటు హిందీలో తీస్తున్న సినిమాల ఘన విజయంతో బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ షేక్ అయిపోతోంది. గత సంవత్సరం తమిళ దర్శకుడు అట్లీ ఫ్లాప్ లతో సతమతమైపోతున్న షారూఖ్ ఖాన్ కు ‘జవాన్’ లాంటి భారీ బ్లాక్ బష్టర్ మూవీతో ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ రజనీకాంత్ ల కాంబినేషన్ లో సినిమా తీసే స్థాయికి ఎదిగిపోయాడు.



ఇక ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలతో ఆస్కార్ అవార్డుల స్థాయికి ఎదిగిపోయిన రాజమౌళి పిలిచి అవకాశం ఇస్తేచాలు అంటూ అనేక మంది బాలీవుడ్ నటీనటులు ప్రముఖ నిర్మాణ సంస్థలు అతడి పిలుపుగురించి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ తో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ మూవీని చేయబోతున్న రాజమౌళి గురించి ఉత్తరాది నిర్మాతలు నటీనటులు తమకు జక్కన్న అవకాశం ఇస్తే చాలు అంటూ కలలు కంటున్నారు.



ఈ లిస్టులో మూడవ స్థానంలో కొనసాగుతున్న సందీప్ వంగ డేట్స్ ఇచ్చి పిలిస్తే చాలు అంటూ క్యూ లైన్ లో బాలీవుడ్ టాప్ హీరోలు నిర్మాణ సంస్థలు వేచి చూస్తున్నాయి. సందీప్ త్వరలో ప్రభాస్ తో తీయబోతున్న ‘స్పిరిట్’ మూవీ మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందని అంచనా. ఇక లేటెస్ట్ గా ఈ లిస్టులోకి  ఎంటర్ అయిన మరో తెలుగు వ్యక్తి నాగ్ అశ్విన్ పేరు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలలో మారుమ్రోగిపోతోంది..  





మరింత సమాచారం తెలుసుకోండి: