చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనే విషయం తెలిసింది. శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించిన విషయం తెలిసింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషయంగా మారటంతో చనిపోయినట్లు పలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా లంగ్స్ డ్యామేజ్ కారణంగా చనిపోయారని సమాచారం. దీనితో అతని మరణం పట్ల చాలామంది సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. అంతా అతనికి లంగ్స్ డామేజ్ అవ్వటం వల్లనే తిరిగారని లోకాలకు వెళ్లాడని ఫిక్స్ అయ్యారు.


ఈ క్రమంలో..తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష్ తల్లి అతని మరణానికి గల కారణం తెలిపి అందరిని షాక్ కు గురిచేసింది. "మేలో అతని పుట్టిన రోజును దుబాయ్ లో జరుపుకుని వచ్చాడు. ఆ తరువాత అనారోగ్యానికి గురి కావటంతో శిరీష్ ను జూబ్లిహిల్స్ అపోలో హాస్పటల్లో చేర్పించాము. దాదాపు అక్కడే అడ్మిట్ అయి 30 30 రోజులకు చికిత్స తీసుకుంటుండగా ..ఒకరోజు కార్డియాక్ అరెస్ట్ కావటంతో జూన్ 19 మరణించాడు. కానీ కొన్ని వీడియా సంస్థలు వారికి తెలియక పోవటం వల్ల శిరీష్ మరణం గురించి తప్పుగా రాశారు. కానీ అందులో నిజం లేదు. అయితే భరద్వాజ్ చనిపోయాక అంత్యక్రియలకు చిరంజీవి ఫ్యామిలీకి తెలిపాము. కానీ వారు రాలేదు. నాకు నా మనవరాలు నివృత్తిని చూడాలనిపిస్తుంది.


కానీ నేను పోయేలోపు వాళ్లు నా  మనవరాలిని చూస్తే అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి "అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శిరీష్ తల్లి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా..శ్రీజ, శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. అప్పట్లో వీరిద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవడంతో సంచలనం సృష్టించింది ఈ ఘటన. కానీ ఈ జంట కాపురం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఓ కూతురు పొట్టగానే మనస్పర్థలు రావటంతో విడాకులు తీసుకుని విడిపోయారు. శ్రీజ కళ్యాణ్దేవుని పెళ్లి చేసుకుంది. అలాగే శిరీష్ కూడా ఓ డైరెక్టర్ ను వివాహం చేసుకున్నాడు. కానీ సడెన్ గా మరణించటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: