రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ స్టార్ హీరోల కలెక్షన్ల రికార్డులను సైతం డార్లింగ్ బ్రేక్ చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా కల్కి 2898 ఏడీ వసూళ్లలో దుమ్ము దులుపుతోంది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. విదేశాల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో దేశవిదేశాల్లో ఈ సినిమా వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా ఇప్పటికే ఓ ప్రాంతంలో ఏకంగా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. కేవలం 5 రోజుల్లోనే ప్రభాస్ సినిమా ఈ ఘనత సాధించింది. బాక్సాఫీసు వద్ద వేల్యూ బిజినెస్‌ను ప్రభాస్ కల్కి సినిమా దాటేసింది. ఈ క్రమంలో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అయిన ప్రాంతంగా అది నిలిచింది. అదెక్కడో కాదు... కేరళ. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో అక్కడ వసూళ్లు వస్తున్నాయి. బాహుబలి అనంతరం వచ్చిన సినిమాలకు అక్కడ వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. మిడ్ రేంజ్ వసూళ్లతో ప్రభాస్ ఇతర సినిమాలు సరిపెట్టుకున్నాయి. అయితే గతేడాది విడుదలైన సలార్ సినిమా అక్కడ మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం విడుదలైన మరో సినిమా కల్కి ఇప్పటి వరకు విడుదలైన ప్రభాస్ సినిమాల వసూళ్లంటినీ దాటేలా కనిపిస్తోంది.

కేరళలో ఓవరాల్‌గా ప్రభాస్ కల్కి సినిమా రూ.6 కోట్ల వేల్యూ బిజినెస్ సాధించింది. అయితే కేవలం 4 రోజులు పూర్తయ్యే సమయానికి ఇక్కడ షేర్ రూ.5.80 కోట్లు సొంతం చేసుకుంది. సినిమా 5వ రోజైన సోమవారం సైతం కేరళలలో థియేటర్లు కళకళలాడాయి. దీంతో ఈ రాష్ట్రంలో కల్కి సినిమా బిజినెస్‌ను దాటి ప్రాఫిట్‌లోకి వచ్చేసింది. ఏదైనా సినిమా వేల్యూ బిజినెస్‌ను దాటి వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లు అర్ధం. ఇక అక్కడ నుంచి వచ్చేవన్నీ ఆ సినిమాకు లాభాలే. ఇలా కేరళలో కల్కి సినిమా లాభాల్లోకి ఎంటర్ అయింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అన్ని ప్రాంతాల్లోనే జోరు ఇదే తరహాలో కొనసాగించే అవకాశం ఉంది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు మంచి టాక్ ఉండడంతో రానున్న రోజుల్లోనూ వసూళ్లు భారీగానే రానున్నాయి. దీంతో ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రాంతాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: