పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అని గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్.. ఈ సినిమా తర్వాత మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. సాహో, రాదేశ్యామ్, ఆది పురుష్ లాంటి భారీ బడ్జెట్ మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు ఎందుకో పెద్దగా హిట్ కాలేకపోయాయి. అయితే ఇలా వరుస ఫ్లాప్ ల నుండి  ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు ప్రభాస్. సలార్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ప్రభాస్ ఇక ఇప్పుడు కల్కి అనే మూవీతో ఏకంగా ఇండస్ట్రీని షేక్ చేసే విజయాన్ని అందుకున్నాడు.



 నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ థియేటర్లలో ఎంతలా ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు రోజుల్లోనే 552  కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇంకా 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది  ప్రతి ఒక్కరిని కూడా ఈ సినిమా మంత్రముగ్దులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులు అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. అయితే ఇక ఇప్పుడు చిన్న డైరెక్టర్ అయిన మారుతితో రాజా సాబ్ అనే మూవింగ్ చేస్తున్నాడు ప్రభాస్.


 ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో అటు డైరెక్టర్ మారుతి ఎలాంటి స్టోరీని తెరకెక్కిస్తున్నాడు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే గతంలో మారుతి దర్శకత్వంలో వచ్చి ప్రేక్షకులను అలరించి హిట్ అయిన ప్రేమ కథ చిత్రం లాంటి హర్రర్ కామెడీ సినిమానే ఇక ప్రభాస్తో తీయబోతున్నాడట మారుతి. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కొన్ని దుష్ట శక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలను ఓ ప్రేమజంట ఎలా ఎదుర్కొంది అనేదే ఇక ప్రభాస్ తో తీస్తున్న రాజాసాబ్ మూవీ స్టోరీ లైన్ అనే ఐఎండీబి వెబ్సైట్ పేర్కొంది. స్టోరీ లైన్ ఇది కాదు అంటూ మారుతి సన్నిహితుడు నిర్మాత ఎస్ కే ఎన్ పరోక్షంగా స్పష్టతను ఇచ్చారు. దీంతో రాజా సాబ్ స్టోరీ లైన్ ఏంటి అన్న విషయంపై మరింత ఉత్కంఠ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: