టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా కల్కి సినిమాతో పేరు పొందారు డైరక్టర్ నాగ్ అశ్విన్.. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో కలిసి తెరకెక్కించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కల్కి చిత్రాన్ని చూసిన వారంతా కూడా డైరెక్టర్ డైరెక్షన్ ని మెచ్చుకోక తప్పడం లేదు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ తల్లితండ్రులు వృత్తిరీత్యా వైద్యులు అయినప్పటికీ అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారట. ముఖ్యంగా ఈయన తల్లిదండ్రులు జయరాం , జయంతి రెడ్డిలు .. నాగ్ అశ్విన్ సోదరి కూడా వైద్యురాలేనట.. వీరు ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్ లో హాస్పిటల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.


నాగ్ అశ్విన్ ను కూడా తల్లిదండ్రులు డాక్టర్ గా చూడాలనుకున్నారట. కల్కి సినిమా ముందు ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి మాట్లాడడం జరిగింది నాగ్ అశ్విన్ తల్లి జయంతి.. ఆమె మాట్లాడుతూ తన కుమారుడుని డాక్టర్ని చేయాలనుకున్నాము.. ఇంటర్లో ఎం బైపీసీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఉంటే ఆ కోర్సులో చేర్పించామని తెలిపారు. మెడిసిన్ లో రెండుసార్లు ఎంట్రెన్స్ లు కూడా రాసి క్వాలిఫై కూడా అయ్యారు.. కానీ డాక్టర్ అవ్వాలని చెప్పేసి.. మణిపాల్ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లు డిగ్రీ చేశారని తెలిపారు.


ఆ తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీలో డైరెక్టర్ కోర్సు చేశారని.. ఆ తర్వాతే లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారని తెలిపారు. చివరికి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.. కుటుంబం లో డాక్టర్లు ఉన్నప్పటికీ.. నాగ్ అశ్విన్ మాత్రం వైద్యుడుగా కంటే డైరెక్టర్ గా మారి మంచి పాపులారిటీ సంపాదించుకోగలిగారు. మహానటి, కల్కి వంటి చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో మరింత క్రేజా అందుకున్నారు డైరెక్టర్. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి చిత్రాలను తెరకెక్కిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: