ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..కల్కి 6వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సందడి చేసింది. ఈ మూవీ తాజా సమాచారం ప్రకారం.. తెలుగులో 11.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్లు, హిందీలో 14 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం తెలిసింది.ఇండియాలో వివిధ భాషల్లో కల్కి సినిమా నిలకడగానే కాకుండా బ్రహ్మండమైన వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా గత ఆరు రోజుల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులు తిరగ రాసింది.


తెలుగులో 200 కోట్ల రూపాయలు, తమిళంలో 21 కోట్ల రూపాయలు, హిందీలో 145 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35 కోట్ల రూపాయలు ఇంకా కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా ఆరో రోజు కూడా రికార్డు లెవెల్ కలెక్షన్లు రాబట్టింది. 6వ రోజున ఇతర సినిమాలు సాధించిన వసూళ్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఇండియా వైడ్ ఈ సినిమా 28 కోట్ల పైగా రాబట్టినట్లు తెలిసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది.కల్కి సినిమా మొదటి 5 రోజుల్లో వసూళ్ల తుఫాన్‌ను మరిపించింది. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 6వ రోజు కలెక్షన్లను కలిపితే ఈ మూవీ దాదాపు 680 కోట్ల రూపాయల దాకా వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక కలెక్షన్లు పెరిగితే ఈ సినిమా ఈరోజుతో 700 కోట్లని దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: