రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన థియేటర్లను విడుదల అయింది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... దిశ పటానీ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ లో బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృనాల్ ఠాకూర్ ముఖ్య పాత్రలలో నటించారు.

విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలలో నటించగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ ఈ మూవీ ని నిర్మించింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. దీనితో ఈ మూవీ నైజాం ఏరియాలో మరికొన్ని రోజుల్లోనే బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్లను క్రాస్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇక బాహుబలి 2 సినిమా నైజాం ఏరియాలో టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 68 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇప్పటి వరకు కల్కి సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ మాత్రమే నైజాం ఏరియాలో కంప్లీట్ అయింది. ఈ సినిమాకు మరికొన్ని రోజులు కూడా అద్భుతమైన కలెక్షన్లు ఈ ఏరియాలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నైజాం ఏరియాలో 63.56 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో మరో రెండు , మూడు రోజులలో ఈజీగా కల్కి సినిమా నైజాం ఏరియాలో బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: