యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను యూస్ చేసుకుంటూ ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా మూవీలను ఓకే చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.

సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ "వార్ 2" సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ దేవర సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ విడుదల అయితే ఆ తర్వాత మరో మూడు , నాలుగు నెలల్లోనే వార్ 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా ఆగస్టు నెల నుండి మొదలు పెట్టబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్లో కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ మరోవైపు దేవర 2 సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత సినిమా విడుదల కావడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మాత్రం వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కూడా రాధే శ్యామ్ సినిమా తర్వాత కాస్త ఎక్కువ సమయం తీసుకున్న ఆ తర్వాత మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: