తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన మీడియం రేంజ్ హీరోలలో నాని ఒకరు. ఇక నాని ఎప్పుడు కూడా ఒక సినిమాకు మరో సినిమాకు మధ్యగా గ్యాప్ తీసుకోడు. దానికి ప్రధాన కారణం ఈయన క్రేజ్ ఉన్న దర్శకుల కోసం , స్టార్ కాంబోల కోసం వెయిట్ చేయకుండా పెద్దగా క్రేజీ లేని దర్శకులతో , కొత్త దర్శకులతో అయిన సరే కథ బాగుంది , సినిమాను బాగా తీస్తాడు అనే నమ్మకం ఉంటే అతనితో సినిమా చేస్తుంటాడు. దానితో ఈయన కెరియర్ మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న ఎప్పుడూ లాంగ్ గ్యాప్ తీసుకోలేదు.

కానీ ప్రస్తుతం మాత్రం నాని పెద్ద కన్ఫ్యూజన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే కొంత కాలం క్రితమే నాని "హాయ్ నాన్న" అనే మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే సరిపోతా శనివారం అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ను కొన్ని రోజుల క్రితమే మొదలు పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కు దగ్గరికి వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే బలగం మూవీ దర్శకుడు వేణుతో ఒక మూవీ , రన్ రాజా రన్ మూవీ దర్శకుడు సుజిత్ తో ఒక మూవీ చేయడానికి నాని కమిట్ అయ్యాడు. దీనితో నాని "సరిపోదా శనివారం" సినిమా తర్వాత ఏక కాలంలో రెండు సినిమాలు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ వేణు , నానికి కొన్ని రోజుల క్రితమే ఒక కథను వినిపించగా అది దసరా మూవీ కి దగ్గరగా ఉండడంతో దానిని రిజెక్ట్ చేసినట్లు , ఇక సుజిత్ తో అనుకున్న సినిమా భారీ బడ్జెట్ కానుంది అనే ఉద్దేశంతో అది కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా శేఖర్ కమ్ములాతో నానిసినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ శేఖర్ తో నాని సినిమా చేయాలి అనుకున్న ప్రస్తుతం శేఖర్ "కుబేర" సినిమాతో బిజీగా ఉన్నాడు. దానితో శేఖర్ తో నాని సినిమా చేయాలి అంటే చాలా టైమ్ వెయిట్ చేయవలసి ఉంటుంది. మరి నాని , ఒక దర్శకుడి కోసం వెయిట్ చేస్తూ ఉండిపోతాడా ..? లేక మరో సినిమాని సెట్ చేసుకొని స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: