సినీ పరిశ్రమలో హీరోల కెరియర్ తో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది. సినీ పరిశ్రమలో అతి తక్కువ మంది నటీమణులు మాత్రమే చాలా సంవత్సరాలు కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోతూ ఉంటుంది. దానితో ఇండస్ట్రీలోకి వచ్చాక మంచి గుర్తింపు రాగానే ఎక్కువ శాతం మంది హీరోయిన్స్ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగే వారు ఎక్కువ శాతం ఐటం పాటలలో డాన్స్ చేసేవారు కాదు.

కేవలం హీరోయిన్ పాత్రలోనే నటిస్తూ ఉండేవారు. కానీ ఆ తర్వాత ట్రెండ్ మారింది. అద్భుతమైన క్రేస్ ఉండి, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న వారు కూడా ఐటమ్ సాంగ్ లలో చేసిన వారు ఉన్నారు. అలా భారీ క్రేజ్ ఉన్న సమయంలో ఐటమ్ సాంగ్ చేసినట్లు అయితే ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది. అలాగే ఐటమ్ సాంగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సిన పని కూడా ఉండదు. దానితో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే అనుష్క తన కెరియర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్టాలిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో నటించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ సాంగ్ ద్వారా అనుష్కకు కూడా సూపర్ క్రేజ్ లభించింది. ఇక అనుష్క చాలా సంవత్సరాల పాటు తెలుగులో టాప్ హీరోయిన్గా కంటిన్యూ అయింది. ఇప్పటికీ కూడా ఇవ్వకు అద్భుతమైన గుర్తింపు ఉంది. ఇక ఈమెతో పాటు కెరియర్ను మొదలుపెట్టిన అనేకమంది ఎన్నో ఐటెం పాటలలో నటించి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకున్నారు. కానీ అనుష్కకు క్రేజ్ ఉండి కూడా స్టాలిన్ సినిమాలో చేసిన ఆ ఒక్క స్పెషల్ సాంగ్ తోనే ఆ పాటలకు పులిస్టాప్ పెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: