తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో తేజ ఒకరు. ఈయన సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత దర్శకుడుగా టర్న్ తీసుకున్నాడు. అందులో భాగంగా ఈయన తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలను దర్శకత్వం వహించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈయన తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. అందులో భాగంగా ఈయన చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కించిన అనేక మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈయన పేరు కొన్ని సంవత్సరాల క్రితం మారు మోగింది.

కానీ ఆ తర్వాత ఈయన ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో వెనకబడిపోయాడు. చాలా అపజయాల తర్వాత కొంత కాలం క్రితం ఈయన రానా హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన నేనే రాజు నేనే మంత్రి మూవీ తో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన పలు సినిమాలు కు దర్శకత్వం వహించిన అవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇకపోతే ఈయన ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటాడు. దానివల్ల ఈయనకు కొన్ని సార్లు నష్టం కూడా జరిగింది. ఉదాహరణకు ఈయన కొన్ని సంవత్సరాల క్రితం దాసరి నారాయణరావు కి సంబంధించిన ఓ సినిమా విడుదలకు ముందే ఆ సినిమా గొప్పగా ఏమీ ఉండదు, అది ప్రేక్షకులను ఆకట్టుకోదు అని అన్నాడట.

ఇక తీరా సినిమా విడుదల అయ్యాక అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదట. దీనితో దాసరి , తేజ మాటల వల్లే నా సినిమాకు చాలా నష్టం జరిగింది. అందుకు ఆయన పెనాల్టీ కట్టాలి అని అన్నాడట. దానితో సినిమా పెద్దలందరూ కలిసి తేజ కు ఒక కోటి రూపాయలు ఫైన్ వేయగా , ఇది ఆయన కట్టాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తేజ నే చెప్పుకొచ్చాడు. ఇలా అనవసరంగా కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల ఈయన పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: