తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో మారుతి ఒకరు. ఈయన ఈ రోజుల్లో అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి. ఆ సమయంలో ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

ప్రస్తుతం ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నీది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ హీరోయిన్లుగా రూపొందుతున్న రాజా సాబ్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ను ఏ మాత్రం హడావిడి లేకుండా మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ఏ సందడి లేకుండా జరిగిపోతుంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి పెద్దగా అప్డేట్లను విడుదల చేయలేదు. దానికి వీరు స్పందిస్తూ కల్కి సినిమా విడుదల తర్వాతే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు ఉంటాయి అని చెప్పారు. ఇప్పటికే కల్కి విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సినిమా నుండి అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది.  

కల్కి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ప్రభాస్ నుండి రాబోయే తర్వాతి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రభాస్ నుండి నెక్స్ట్ రాజా సాబ్ మూవీ విడుదల కానుంది. దానితో ఒక వేళ ప్రభాస్ తో మారుతీ కనుక మంచి సినిమా తీసి హిట్ కొట్టినట్లు అయితే ఒక్క సారిగా ఈయన క్రేజ్ అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోతుంది. కానీ ఏదైనా తేడా కొట్టి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే ఈయన లైఫ్ అదే స్థాయిలో కిందికి పడిపోతుంది అని చాలా మంది భావిస్తున్నారు. మరి మారుతి , ప్రభాస్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో ... ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: