ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించు కోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ లో కేవలం కొంత మంది హీరోలు మాత్రమే ఇలాంటి అరుదైన రికార్డులను సాధించారు. అలాంటి వారిలో విశ్వక్సేన్ కూడా ఒకరు. తన కెరియర్ను ఎవరో నిలబెడతారు అని ఆశపడకుండా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా హీరోగా మారి సినిమాలు తీశారు.


 ఇక తెలుగు చిత్ర పరిశ్రమ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. అయితే ఇక విశ్వక్సేల్ పేరు వినిపిస్తే మాస్ క్యారెక్టర్లే ప్రేక్షకులందరికీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన తన సినిమా లో చేసింది కూడా ఇలాంటి పాత్రలే కావడం గమనార్హం. అయితే ఇలా మాస్ కా దాసస్ గా పేరు సంపాదించుకొని పవర్ఫుల్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్న హీరో విశ్వక్సేన్ ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఎవరు ఊహించని ఒక సరికొత్త సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.


 సరికొత్త సినిమా అనగానే డీసెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అనుకునేరు. ఏకంగా అమ్మాయి క్యారెక్టర్ లో నటించేందుకు రెడీ అయ్యాడు మాస్ కా దాస్ విశ్వక్సేన్. రామ్ నారాయణ దర్శకత్వంలో  విశ్వక్సేన్ హీరోగా లైలా అనే సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీలో అమ్మాయి పాత్ర లో నటించ బోతున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం నేడు జరగ్గా ఫస్ట్ పోస్టర్ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. అయితే లేడీ గెటప్ లో విశ్వక్ బ్యూటిఫుల్ గా ఉన్నాడని అభిమానులు అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండటం గమానార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: