నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితమే హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే నాని , శ్రీకాంత్ దర్శకత్వంలో దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు.

పోయిన సంవత్సరం మార్చి నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ నాని కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. ఈ సినిమాతో నాని కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక దసరా మూవీ ని తెరకెక్కించిన విధానం నచ్చడంతో నాని ఈ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి శ్రీకాంత్ , నానితో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో 1992 , 93 కాలానికి సంబంధించిన స్టోరీ తో మూవీ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే నానికి శ్రీకాంత్ పూర్తి కథను వినిపించగా , ఆయనకు ఈ సినిమా కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ దర్శకుడి మూవీ లో మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాని , శ్రీకాంత్ కాంబోలో తెరకెక్కబోయే రెండవ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో నాని హీరో గా రూపొందిన నేను లోకల్ , ఎంసీఏ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ రెండు మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడం మాత్రమే కాకుండా ఈ రెండు మూవీ ల పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: