కల్కి సినిమాతో వరల్డ్ వైడ్ గా ఎక్కడ విన్నా కూడా ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరే వినబడుతోంది. కల్కి సినిమాతో ఇంతటి ప్రభంజనాన్ని సృష్టించాడు ఈ డైరెక్టర్. అంతేకాదు ఇప్పటివరకు దర్శక ధీరుడు రాజమౌళి కి పోటీ ఎవ్వరూ లేరు అని అనుకునే సమయంలోనే నాగ్ అశ్విన్ రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్గా వచ్చాడు. ఇక ఇటీవల విడుదలైన కల్కి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్ట్ వన్ ఇంతలా ఉంది అంటే మరి పార్ట్ 2 ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఊహకందని విధంగా పార్ట్ టు

 రాబోతోంది అంటూ ఇదివరకే వెల్లడించాడు నాగ్ అశ్విన్. అయితే  ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చిరంజీవితో సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వలో చిరంజీవి సినిమా ఉండబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా అనే టాక్‌ ప్రారంభమైంది.   కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ చిరుతో సినిమా చేయాలనే ప్లాన్ ఉందని టాక్. అది

 కల్కిని మించి ఉండబోతుందని అంటున్నారు. కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్రతో బిగ్ బి అమితాబ్ ని ఒక రేంజ్ లో చూపించాడు నాగ్ అశ్విన్. ఐతే అదే రేంజ్ లో చిరంజీవితో చేసే సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. చిరుతో నాగ్ అశ్విన్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి సోషయో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. పురాణాలు, సోషల్‌ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్డెట్‌తో, భారీ కాస్టింగ్‌తోనే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి భామలు మెరవబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: