స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ మూవీ థియేటర్లలో ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది కాజల్ అగర్వాల్. ఈ మూవీ జూన్ ఏడవ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. సత్యభామ మూవీకి ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వచ్చింది. మాస్టారుగా కలెక్షన్లు రాబట్టుకుంది సత్యభామ మూవీ. ఇక ఇప్పుడు ఓటిటిలో దుమ్ము రేపుతుంది. అప్పుడే ఓ మైలురాయిని దాటింది. సత్యభామ సినిమా జూన్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫారం లోకి స్ట్రీమింగ్ కి వచ్చింది.


ముందస్తు ప్రచారం లేకుండానే ఈ. ఇక ఆరంభం నుంచే ఈ మూవీకి ప్రైమ్ వీడియో ఓటిటిలో భారీగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఆరంభం నుంచి టాప్ ఫైవ్ లోనే ట్రెండింగ్ లోనే ఉంది. సత్య మామ సినిమా amazon ప్రైమ్ వీడియో లో మైల్ స్టోన్ దాటింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది. ఇక ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. " 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిపోయింది. ప్రైమ్ వీడియోలో సత్యభామ చూడండి. యాక్షన్ డ్రామాలో లీనం అవ్వండి " అనే కొటేషన్ తో ఈ విషయాన్ని ప్రకటించారు మూవీ టీం.


ఇక సత్యభామ మూవీకి సుమన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అతడి టేకింగ్ అండ్ కథనం ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ అగరగొట్టిందని చెప్పుకోవచ్చు. యాక్షన్ లోను దుమ్మురేపింది. ఇంటెన్స్ యాక్టింగ్ తో నేర్పించింది. హిట్ వన్ అండ్ టూ మేజర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్క ఈ మూవీకి స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వహించారు. ఓ నిర్మాతగాను వ్యవహరించారు. దీంతో సత్యభామ చిత్రానికి మరింత హైట్ వచ్చింది. మరోపక్క మూవీ ప్రమోషన్స్ ని కూడా జోరుగా చేయడంతో ఈ మూవీ భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: